పొడుపు కథలు
1. ఒంటి కున్నువాడు, పరుగు పరుగున కంచం వేస్తాడు. అది ఎవరు?
జ. సూది.
2. అన్నదమ్ములు ముగ్గురు అలుపు లేకుండా తిరుగుతారు. ఏంటో చెప్పండి?
జ. ఫ్యాన్.
3. ఒంటి నాలుక వాడు, ఆకాశం లో వేలాడుతాడు, నాలుక లాగితే ఠ0గుమంటాడు.
జ. గంట.
4. దేశాలన్నీ తిరుగుతుంది, కానీ దేశంలోకి వెళ్లదు. అదేంటి?
జ. ఓడ.
5. రెక్కలుంటాయి కానీ పక్షి కాదు. తల కిందలుగా వేలాడుతుంది కానీ గబ్బిలం కాదు. ఏమిటది?
జ. ఫ్యాన్.
6. తెల్లగా మల్లె పువ్వులా ఉంటుంది, లోపల చూస్తే బంగారు రంగు లో ఉంటుంది, తింటే కరకరలాడుతుంది. అది ఏంటి?
జ. పాప్ కార్న్.
7. తెల్లని బంతి, చల్లని బంతి, ఎవ్వరు అది బంతి. అదేంటి?
జ. చందమామ.
8. చెట్టుకు కాయని కాయ, కారకరా లాడే కయ. అదేంకాయ?
జ. కజ్జికాయ.
9. గుండ్రటి భవనంలో బోలెడన్ని తెరలు, వాటి చాటున ఎర్ర సిపాయిలు. ఏమిటో చెప్పండి?
జ. దానిమ్మపండు.
10. అందరిని పైకి పంపుతుంది, యముడు కాదు. మన బరువు మోస్తుంది గాడిద కాదు. అదేంటో చెప్పండి?
జ. నిచ్చెన.