Moral Stories in Telugu on నమ్మకం (Faith) and సమానత్వం

  Moral Stories in Telugu | Inspirational Stories for Kids

Welcome to our collection of best Moral Stories in Telugu for children! 

 

 Discover two heartwarming Telugu moral stories, that teach life is full of lessons. These stories highlights significant moral values such as responsibility, equality, and faith. Through relatable characters and everyday situations, these stories encourage us to reflect on our own beliefs and actions, making them perfect for readers of all ages.

 In this post, we’ll explore two wonderful stories.

  • ఋషి యొక్క సమానత్వ పాఠం | The Sage's Lesson of Equality
  • క్షవరకుడు మరియు నమ్మకం | The Barber and The   Belief
______________________________

ఋషి యొక్క సమానత్వ పాఠం | The Sage's Lesson of Equality

 కథ నేపథ్యం (Story Context):

ఒక ఋషి తన సొంత ఆశ్రమంలో ధనికులు, పేదల పిల్లలందర్నీ సమానంగా చూసేవాడు. ఆయన వారికి శుభ్రత, బాధ్యత, ప్రేమ, మరియు సమానత్వాన్ని నేర్పించేవాడు. అయితే, ఒక గర్వంతో కూడిన యువరాజు ఆశ్రమంలో చేరినప్పుడు, ఆశ్రమంలోని సమతాన్ని అతను భంగపరచాడు. ఒక మురికి పిల్లి ద్వారా ఋషి అతనికి విలువైన పాఠం నేర్పించాడు, దాంతో యువరాజు సమానత్వం, శుభ్రత మరియు తన పనుల పట్ల బాధ్యతను ఎలా పాటించాలో తెలుసుకున్నాడు.  


"An image depicting a wise sage guiding a young, proud prince in an ashram setting. The sage points to a dirty kitten, teaching the prince an important lesson about equality, cleanliness, and personal responsibility."

కథ ముఖ్య పాత్రలు:

  • ఋషి: సమానత్వాన్ని, క్రమశిక్షణను విలువగా చూసే జ్ఞానవంతుడు.
  • యువరాజు: గర్వంతో నిండిన బాలుడు.
  • ఆశ్రమంలోని ఇతర పిల్లలు: ధనిక మరియు పేద పిల్లల సమ్మేళనం. ఋషి బోధనలను నమ్మి జీవించే వారు.

కథ:

 ఒక ఋషికి తన సొంత ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో చాల మంది పిల్లలు ఉండేవారు. అతను పేద పిల్లల మరియు ధనవంతుల పిల్లల మధ్య ఎప్పుడు తేడా చూపేవాడు కాదు, అతనికి అందరు సమానమే.


  పిల్లలందరికీ చక్కగా, శుభ్రంగా ఉండాలని ఆయన నేర్పించారు. సహృదయ గుణం మరియు ప్రేమగా ఉండమని ఆయన వారికి నేర్పించేవాడు. పిల్లలు సోమరితనం మరియు వారి స్వంత పని చేయనప్పుడు అతను బాధపడేవాడు.

 

 పిల్లలు ఋషిని చాల ఇష్టపడేవారు మరియు ఎల్లప్పుడూ తమ పనిని సకాలంలో చేసేవారు. ప్రతి పిల్లవాడు ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసేవాడు. వారు ఆశ్రమాన్ని నిర్మానుష్యంగా శుభ్రంగా ఉంచేవారు.


ఒకసారి ఒక యువరాజు ఆశ్రమంలో చేరాడు. అతను, తనను తాను గర్వంగా భావించేవాడు. అతను ఇతర పిల్లలతో చెడుగా వ్యవహరించేవాడు మరియు వాళ్ళతో తన పనులన్నీ చేయించేవాడు. అతను తన గదిని కూడా శుభ్రం చేసేవాడు కాదు. ఆశ్రమంలో అతని గది, అత్యంత మురికి గదిగా మారింది.


ఒకరోజు ఆ ఋషి యువరాజును తోటకు తీసుకువెళ్ళాడు. కొన్ని పిల్లులు బురదలో ఆడుకుంటున్నాయి. ఆ ఋషి అత్యంత మురికి పిల్లిని చూపించి, "ఆ పిల్లిని తీసుకొని సరిగ్గా శుభ్రం చేయి", అని యువరాజుతో చెప్పాడు.


 యువరాజు, "ఇది చాలా మురికిగా ఉంది. దయచేసి దాన్ని శుభ్రం చేయమని నన్ను అడగవద్దు" అని చెప్పాడు. 

 

ఆ ఋషి అతని వైపు చూసి, "నీవు ఇతర పిల్లలను నీ మురికి పాత్రలను, దుస్తులను శుభ్రం చేయమని అంటున్నవు కదా, కనుక నీవు ఆ మురికి పిల్లిని శుభ్రం చేయడానికి ఇబ్బంది పడవని అనుకున్నాను. పర్వాలేదు. నీవు దానిని శుభ్రం చేయకూడదనుకుంటే, కనీసం కూర్చుని దానితో ఆడుకో" అని యువరాజు తో చెప్పాడు.


"కానీ గురుజీ, ఆ ప్రదేశం చాలా మురికిగా ఉంది. నేను అక్కడ ఎలా కూర్చోగలను? " అని యువరాజు మెల్లిగా అన్నాడు. 

 

"ఖచ్చితంగా నీవు చేయగలవు. నీ స్నేహితులు కూడా నీతో కలిసి నీ మురికి గదిలో కూర్చుని ఆడుకుంటారు కాదా? "అని అడిగాడు ఋషి. 

 

యువరాజు సిగ్గుతో తల దించుకోన్నాడు. ఆ ఋషి ఏమి చెప్పాలనుకుంటున్నారో అతనికి అర్థమైంది. 

 

"గురీజీ, నన్ను క్షమించండి. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మరియు మన స్వంత పని చేయడం ఎంత ముఖ్యమో ఇప్పుడు నాకు తెలుసు. 

 

ఈ రోజు నుండి, నేను నా గదిని మరియు ఇతర వస్తువులను ఎప్పుడూ మురికిగా ఉంచను" అని యువరాజు చెప్పాడు. వాళ్ళు తిరిగి ఆశ్రమానికి వెళ్లారు.


Moral of the Story:


“ఎల్లప్పుడూ మనము మన స్వంత పనికి బాధ్యత వహించి, మన పని మనమే చేసుకోవాలి మరియు మన పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ఒకరి స్థోమతకు సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూడాలి.”


“Always be responsible for your own work and keep your surroundings clean.
Treat everyone equally, regardless of their background.”

ప్రాథమిక పాఠం (Basic Lesson):


ఈ కథ మనం
మన పనుల పట్ల బాధ్యత వహించడం మరియు మన చుట్టూ శుభ్రతను పాటించడం ఎంత ముఖ్యమో చెబుతుంది. అలాగే, మన స్థాయి ఎలా ఉన్నా అందరినీ సమానంగా చూడటం మన వ్యక్తిత్వానికి మేలును చేస్తుంది. మురికి పిల్లిని శుభ్రం చేయడాన్ని ఉదాహరణగా ఉపయోగించి, ఋషి గర్వం మరియు నిర్లక్ష్యం మనల్ని ఎలా ఒంటరిని చేస్తాయో చూపించి, వినయంతో మరియు పరస్పర గౌరవంతో జీవించడం యొక్క ప్రాముఖ్యతను యువరాజుకు నేర్పాడు.

__________________________

క్షవరకుడు మరియు నమ్మకం | The Barber and The Belief

 కథ నేపథ్యం (Story Context):


ఒక చిన్న పట్టణంలో, ఒక సాధారణ క్షవరకుడు (బార్బర్‌) తన దుకాణాన్ని నడుపుతూ, తన వినియోగదారులతో ఆసక్తికరమైన చర్చలు జరుపుతుంటాడు. ఒక రోజు, ఒక వ్యక్తి జుట్టు కత్తిరించించుకోవడానికి అక్కడికి వస్తాడు, వారి సంభాషణ దేవుడి ఉనికి గురించి మలుపు తీసుకుంటుంది. 

 

క్షవరకుడు దేవుడు లేడని, ఈ ప్రపంచంలో ఉన్న బాధలు, నొప్పులు మరియు అనాథల కారణంగా నమ్మలేనని వాదిస్తాడు. ఆ వ్యక్తి ఈ మాటలను శ్రద్ధగా విని, ఒక సులభమైన ఉదాహరణతో తన అభిప్రాయాన్ని చెప్పడంలో విజయవంతమవుతాడు, దీని ద్వారా నమ్మకం మరియు దృక్పథం పై విలువైన పాఠం నేర్పబడుతుంది.



"A cozy barbershop scene with a barber trimming a customer's hair. The barber looks thoughtful as he discusses something deeply philosophical. Outside the shop, through a glass window, a disheveled man with unkempt hair and a long beard is visible, representing the turning point in the story."

 కథ ముఖ్య పాత్రలు:

  • క్షవరకుడు: ప్రపంచంలో ఉన్న బాధలను చూసి, దేవుడు లేడని నమ్మే వ్యక్తి.
  • వినియోగదారుడు: పరిశీలనాత్మక మరియు ఆలోచనాపరుడైన వ్యక్తి.
  • అశ్రద్ధగా ఉన్న వ్యక్తి: వీధిలో ఉన్న, పొడవాటి జుట్టు మరియు గడ్డం ఉన్నవ్యక్తి, ఈ కథలో కీలకమైన ఉదాహరణగా మారతాడు.
 

కథ:

ఒకసారి, ఒక వ్యక్తి తన జుట్టు కత్తిరించుకోవడానికి బార్బర్‌షాప్‌కి వెళ్లాడు. క్షవరకుడు (barber) జుట్టు కత్తిరిస్తుండగా, వారు చాలా విషయాల గురించి మాట్లాడుకున్నారు. వారు దేవుని గురించి కూడా మాట్లాడారు.


దేవుడి అంశం పై వచ్చినప్పుడు, "దేవుడు ఉన్నాడని నేను నమ్మను" అన్నాడు క్షవరకుడు. "నువ్వు ఎందుకు అలా అంటావు?" అని అడిగాడు ఆ వ్యక్తి.


"దేవుడు లేడని తెలుసుకోవాలంటే నువ్వు వీధిలోకి వెళ్ళాలి. దేవుడు ఉంటే, ఇంత మంది జబ్బులు ఉన్నవాళ్ళు ఉంటారా? అనాధ పిల్లలు ఉంటారా? దేవుడు ఉన్నట్లయితే, బాధ మరియు నొప్పి రెండు ఉండవు. వీటన్నింటిని అనుమతించే ప్రేమగల దేవుడిని నేను ఊహించలేను", అని చెప్పాడు క్షవరకుడు.


ఆ వ్యక్తి ఒక్క క్షణం ఆలోచించాడు, కానీ అతను వాదన ప్రారంభించ కూడదు అని అనుకోవడం తో స్పందించలేదు.


తన పని అయిపోగానే, ఆ వ్యక్తి దుకాణం నుండి వెళ్లిపోయాడు. అతను బార్బర్‌షాప్ నుండి బయటికి రాగానే, వీధిలో పొడవాటి తీగ ల, మురికి జుట్టు మరియు చాలా పొడవైన గడ్డంతో ఉన్న వ్యక్తిని కనిపించాడు.


ఆ వ్యక్తి వెనక్కి తిరిగి బార్బర్ షాపులోకి ప్రవేశించాడు. లోపలికి రాగానే, అతను క్షవరకుడుతో, "నీకు తెలుసా? క్షవరకులు (barbers) లేరు", అని చెప్పాడు.


"నీవు ఆలా ఎలా అంటావు? నన్ను చూడు, నేను ఒక క్షవరకుడిని. మరియు నేను నీ జుట్టు కత్తరించాను కూడా!" అని ఆశ్చర్యంగా అడిగాడు క్షవరకుడు.


"ఖచ్చితంగా లేరు!" అని చెప్పాడు ఆ వ్యక్తి . "క్షవరకులు లేరు. ఎందుకంటే క్షవరకులు వున్నింటే , బయట ఉన్న మనిషిలా పొడవాటి జుట్టు మరియు కత్తిరించని గడ్డాలు ఉన్నవారు ఉండరు."


"ఆహ్, ఖచ్చితంగా క్షవరకులు ఉన్నారు!" అని క్షవరకుడు జవాబిచ్చాడు. "ఏం జరుగుతుంది అంటే జనాలు నా దగ్గరకు రారు."


"సరిగ్గా అదే!" అని ఆ వ్యక్తి ధృవీకరించాడు. "అదే విషయం! దేవుడు కూడా ఉన్నాడు! ఏమి జరుగుతుంది అంటే, ప్రజలు అతని వద్దకు వెళ్లరు మరియు అతని కోసం వెతకరు. అందుకే ప్రపంచంలో చాలా కష్టాలు మరియు బాధలు ఉన్నాయి" అని చెప్పాడు ఆ వ్యక్తి.


Moral of the Story:


“మనం ఏదో చూడలేనందున అది ఉనికిలో లేదని కాదు; కొన్నిసార్లు మనం దాని కోసం వెతకాలి.”


“Just because we can't see something does not mean it doesn't exist; sometimes we just have to look for it.”

 

ప్రాథమిక పాఠం (Basic Lesson):


ఈ కథ మనకు నేర్పే విషయం ఏమిటంటే, మనం ఏదైనా ప్రత్యక్షంగా చూడలేకపోయినంత మాత్రాన, అది ఉనికిలో లేదు అనుకోవడం సరికాదు. విశ్వాసం మరియు నమ్మకం మనల్ని లోతుగా ఆలోచింపజేయడం, మరింత లోతుగా అన్వేషణ చేయడం అవసరం. ఎలా అంటే, క్షవరకుడు సేవలను పొందాలని కోరుకుంటే, ప్రజలు అతని దగ్గరకు వెళ్లాలి. ఇదే విధంగా, మనం దేవుని సాన్నిధ్యం అనుభవించాలంటే, అతనిని వెతకడం మరియు అతనితో సంబంధాన్ని పెంపొందించుకోవడం అవసరం.
  

_____________________________________


Conclusion:

 

These Moral stories in Telugu remind us of the importance of cultivating positive values in our lives. Whether it's learning to treat everyone equally, regardless of their background, as in the sage's story, or understanding the power of faith and seeking what we cannot see, as in the barber's tale, these lessons are timeless. By applying these morals, we can foster a more responsible, compassionate, and harmonious way of living.

 

Looking for more inspiring tales? Check out our collection of Kindness Moral Stories in Telugu and Animal Stories in Telugu to continue the journey of learning through storytelling!
Previous Post Next Post