Moral Stories in Telugu on విశ్వాసం and కరుణ

 

Moral Stories in Telugu | Inspirational Stories for Kids

Welcome to our collection of best Moral Stories in Telugu for children! 

 

Discover two heartwarming Telugu moral stories, inspire with meaningful life lessons about the importance of trusting the process and believing that every life experience contributes to a greater purpose. And also highlights how even small acts of kindness can create a significant positive impact, encouraging compassion and action."

 

In this post, we’ll explore two wonderful stories.

 

  • రెసిపీ ఆఫ్ లైఫ్ | The Recipe of Life
  • ఒక యువకుడు మరియు స్టార్ ఫిష్ | The Boy and the Starfish

_____________________

రెసిపీ ఆఫ్ లైఫ్ | The Recipe of Life

కథ నేపథ్యం (Story Context):


ఒక చిన్న బాలుడు తన జీవితంలో ప్రతిదీ తప్పుగా జరుగుతోందని భావించి, నిరాశగా తన బామ్మ వద్దకు వెళ్లి తన సమస్యలు చెప్పుకుంటాడు. ఆమె కేక్ తయారు చేస్తూ జీవితంలో ప్రతి సంఘటన మనకు ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుందనే విషయం సమర్థవంతంగా వివరిస్తుంది.


A small boy watching her grandmother baking cake and explaining about life.

కథ ముఖ్య పాత్రలు:

  • బాలుడు: తన జీవితంలోని సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి.
  • బామ్మ: జీవిత పాఠాన్ని చెప్తూ బాలుడికి ప్రేరణనిచ్చే ముసలావిడ.

కథ:

   ఒకసారి ఒక చిన్న బాలుడు తన జీవితంలో ప్రతిదీ తప్పుగా జరుగుతోందని భావించాడు. అతనికి పాఠశాలలో, ఇంట్లో, తన ఆరోగ్యంతో మరియు తన స్నేహితులతో సమస్యలు ఉండేవి.

 

బాలుడు తన బామ్మ తో తన సమస్యలన్నింటి గురించి మాట్లాడుతుండగా, ఆమె కేక్ తయారు చేయడంలో బిజీగా ఉంది. కేక్ తినాలనుకుంటున్నావా అని ఆమె అతన్ని అడిగింది, అతను అవును అని చెప్పాడు.

 

"ఇదిగో, కొంచెం వంటనూనె తీసుకో", అని అంది బామ్మా.


"వద్దు" అన్నాడు బాలుడు.


"పోనీ ఈ గుడ్లు తిను", అంటూ రెండు పచ్చి గుడ్లు ఇవ్వబోయింది బామ్మా.


మళ్ళీ "వద్దు!", అన్నాడు ఆ బాలుడు.


"మరి కొంచెం పిండి కావాలా? లేదా బేకింగ్ సోడా?", అని అడిగింది బామ్మా.


"బామ్మ , అవన్నీ రుచిగా ఉండవు!" అని చెప్పాడు బాలుడు.


కానీ ఆ పదార్థాలు వాటంతట అవే రుచిగా లేకపోయినా, వాటిని సరైన పద్ధతిలో కలిపితే, అవి రుచికరమైన కేక్‌ని తయారుచేస్తాయని బామ్మ వివరించింది.


దేవుడు ఇలాగే పనిచేస్తాడని బామ్మా చెప్పింది. కొన్నిసార్లు మనం కష్ట సమయాలను ఎదుర్కొంటాము మరియు ఎందుకు అని ఆశ్చర్యపోతాము, కాని దేవుడుకి తెలుసు కష్టాలు మరియు సుఖాలు, అన్ని ఒకచోట చేరినప్పుడే, మన జీవితం ఉత్తమంగా పనిచేస్తుందని, ఇది మన "రెసిపీ అఫ్ లైఫ్".  మనము దేవుడిని విశ్వసించవలసి ఉంటుంది మరియు చివరికి, ప్రతిదీ అద్భుతంగా మారుతుంది!


Moral of the Story:


“కష్టాలు ఎదురైనా దేవుని ప్రణాళికపై నమ్మకం ఉంచండి. జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడం సానుకూల ఫలితాలకు దారి తీస్తుంది. చివరికి ప్రతిదీ ఉత్తమంగా మారుతుందని నమ్మండి.”


"We should have faith that everything that happens in life is for our good and trust the process of life."

 


ప్రాథమిక పాఠం (Basic Lesson):

 

మన జీవితంలోని అన్ని అనుభవాలు మంచి లేదా చెడు, కలిసిపోవడం వల్లే జీవితం పరిపూర్ణం అవుతుంది. మనం ప్రతి సంఘటనను స్వీకరించి విశ్వాసంతో ముందుకు సాగితే, చివరికి మన జీవితంలో ప్రతిదీ అద్భుతంగా మారుతుంది.

________________________________

ఒక యువకుడు మరియు స్టార్ ఫిష్ | The Boy and the Starfish


కథ నేపథ్యం (Story Context):

రాజు సముద్రతీర ప్రాంతంలో నివసించేవాడు. ఒక వేసవి ఉదయం, అతను బీచ్ వెంబడి షికారు చేస్తున్నప్పుడు, ప్రకృతి అతనికి ఒక పదునైన దృశ్యాన్ని అందించింది - వేల సంఖ్యలో స్టార్ ఫిష్ ఆటుపోట్లలో చిక్కుకుపోయి, మండుతున్న ఎండలో పోరాడుతున్నాయి. సహజసిద్ధమైన కనికరంతో నడిచిన రాజు చూస్తూ ఊరుకోలేకపోయాడు. స్టార్ ఫిష్‌ని తిరిగి సముద్రంలోకి పంపడానికి రాజు ఎలా సహాయం చేశాడనేది కథ.

A boy throwing Starfish back in to the sea water.


కథ ముఖ్య పాత్రలు:

  • రాజా: సహాయసిద్ధతతో నిండిన యువకుడు.
  • వృద్ధుడు: రాజా చేసిన చిన్న సహాయం వెనుక గొప్పతనాన్ని గ్రహించే వ్యక్తి.
  • గ్రామస్తులు: రాజా ప్రేరణతో కలిసి పనిచేసిన సాంఘిక సమూహం. 

కథ:

ఒకప్పుడు, బంగాళాఖాతం ఒడ్డున ఉన్న ఒక చిన్న తీర గ్రామంలో రాజా అనే యువకుడు ఉండేవాడు. అతను తన రోజులను సముద్రతీరంలో గడపడం, అలల శబ్దం మరియు తన పాదాల క్రింద ఇసుక యొక్క మృదువైన స్పర్శను ఆస్వాదించడం ఇష్టపడేవాడు. ఒక వేసవి ఉదయం, అతను బీచ్ వెంబడి నడుస్తుండగా, వేల సంఖ్యలో స్టార్ ఫిష్‌లు ఒక పెద్ద అల (tide) వల్ల ఒడ్డుకు కొట్టుకుపోవడాన్ని గమనించాడు.


రాజా దగ్గరికి రాగానే, స్టార్ ఫిష్ ఎండలో బ్రతకడానికి పొరరడం గమనించాడు, బ్రతకడానికి నీళ్ల కోసం వెతుకుతూ ఉండటం చూశాడు. అతను వెంటనే వాటిని ఒక్కొక్కటిగా తీయడం ప్రారంభించాడు మరియు జాగ్రత్తగా వాటిని తిరిగి సముద్రంలోకి విసిరాడు.


అటుగా వెళుతున్న ఒక వృద్ధుడు, "ఎందుకు కష్టపడ్తావు? నీవు అలా ఒక్కొక్క స్టార్ ఫిష్ ని మళ్ళి సముద్రంలో విసరడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చాలా స్టార్ ఫిష్‌లు ఉన్నాయి. నీవు వాటన్నింటిని రక్షించలేవు" అని ఆ యువకుడు తో చెప్పాడు.


రాజా నిరుత్సాహపడినప్పటికీ, మరొక స్టార్ ఫిష్‌ను పట్టుకుని "దీని జీవితానికి తేడా పడుతుంది" అని చెపుతూ సముద్రంలో విసిరాడు.


ఆ వృద్ధుడు, ఆ యువకుడి చర్యలలోని నిజాయితీని గమనించాడు మరియు రాజా తన పనిని కొనసాగించడాన్ని గమనించాడు. ప్రేరణతో, అతను ఆ యువకుడితో పాటు కలిసి, స్టార్ ఫిష్‌ను నీటిలో తిరిగి వారి ఇంటికి పంపడంలో రాజాకి సహాయం చేశాడు.


గ్రామస్తులు వారు కలిసి పని చేయడం గమనించి వారికీ మద్దతుగా నిలిచారు. ఒడ్డున పడి ఉన్న స్టార్ ఫిష్‌ను రక్షించడంలో ప్రతి ఒక్కరూ సహాయం చేయడంతో, ఒక చిన్న సంఘం త్వరగా ఏడ్పడింది. బీచ్‌ను కప్పి ఉంచిన స్టార్ ఫిష్, సముద్రం లోని వాటి నివాసాన్ని తిరిగి చేరడం తో బీచ్ క్లియర్ అయింది.


రోజు గడిచేకొద్దీ, రాజా చర్యని సందేహించిన వ్యక్తి, రాజా వద్దకు వచ్చి, "నువ్వు చెప్పింది నిజమే. మనము వీటన్నిటిని రక్షించలేకపోయినా, కానీ చాలా వాటి జీవితానికి తేడా కలించాము".

 

Moral of the Story:


"మనము దయ గుణంతో చేసే సహాయం చిన్నదైనా, అది ఎంతో ఉపయోగ పడుతుంది మరియు పెద్ద మార్పును తెస్తుంది."


“Even if our act of kindness is small, it will go a long way and make a big difference.”


ప్రాథమిక పాఠం (Basic Lesson):

 

చిన్న చర్యలు కూడా పెద్ద మార్పులు తీసుకురాగలవు. మన దయగుణంతో చేసే సహాయం చిన్నదైనా, అది పెద్ద ప్రేరణను ఇచ్చి మార్పు తీసుకురాగలదు.


_______________________________


Conclusion:

These Moral Stories in Telugu beautifully remind us that faith and kindness are powerful virtues. Trusting life’s journey can lead to unexpected rewards, and even small, thoughtful actions can ripple outward, making the world a better place. These tales teach us to believe in ourselves, value others, and embrace challenges with hope and empathy. 

 

Looking for more inspiring tales? Check out our collection of Kindness Moral Stories in Telugu and Animal Stories in Telugu to continue the journey of learning through storytelling!
 



Previous Post Next Post