Moral Stories in Telugu - పగిలిన కుండ & నాట్యం చేసిన ఒంటె

These 2 Telugu Moral Stories are part of our collection and promises to inspire and teach valuable lessons. 

 

These two beautiful stories teach us that our weaknesses can sometimes be our strengths. The first story, "The Cracked Pot," shows how even our flaws can create something wonderful. The second story, "The Dancing Camel," teaches us to accept ourselves instead of trying to be like others. Let’s read these inspiring stories and learn an important lesson about self-acceptance and inner strength.

 

  • పగిలిన కుండ | The Cracked Pot
  • నాట్యం చేసిన ఒంటె | The Dancing Camel

__________________________

పగిలిన కుండ | The Cracked Pot

పగిలిన కుండ - కథ నేపథ్యం:

ఒక చిన్న గ్రామంలో, ఒక తోటమాలి తన తోటను ప్రేమగా చూసుకునేవాడు. ప్రతిరోజూ, అతను నది నుండి రెండు పెద్ద కుండల్లో నీళ్లు తీసుకువచ్చి తన తోటకు నీరు పోసేవాడు. వాటిలో ఒక కుండ బాగుండేది, మరొక దానికి చిన్న పగుళ్లు ఉండేవి. పగుళ్ల కారణంగా, ఆ కుండా వైపు ఉన్న దారి పొడువునా నీరు కారేవి. 

 

A Gardener carrying water pots on his shoulder.

 

పగిలిన కుండ - కథ ముఖ్య పాత్రలు:

  • తోటమాలి - తన తోటను ప్రేమగా చూసుకునే కష్టపడి పనిచేసే వ్యక్తి.
  • మొదటి కుండ - పగుళ్లు లేనిది మరియు పూర్తి నీరును మోసేది.
  • రెండవ కుండ - చిన్న పగుళ్లు ఉన్న కుండ మరియు దాని నుండి దారి పొడువునా నీరు కారేవి. 
 

పగిలిన కుండ - కథ:

ఒక చిన్న గ్రామంలో, ఒక తోటమాలి తన అందమైన తోటను చూసుకునేందుకు ఎంతో కష్టపడేవాడు. ప్రతి రోజు, అతను నది నుండి తన తోట వరకు నీటితో నిండిన రెండు పెద్ద మట్టి కుండలను మోసుకెళ్లేవాడు. కుండలలో ఒకటి బాగుండేది, కానీ మరొకదానికి చిన్న పగుళ్లు ఉండేవి. ఈ పగుళ్ల కారణంగా దారి పొడువునా నీరు కారేవి. 

 

ప్రతిసారి తోటమాలి తోటకు చేరేసరికి, పగిలిన కుండిలో సగం నీరు మాత్రమే మిగిలేది. దీనివల్ల, ఆ కుండ, తను, తన పని పూర్తిగా చేయలేక పోతున్నాని, తన వల్ల నీరు వృథా అవుతోందని విచారంగా ఉండేది. 

 

ఒక రోజు, పగిలిన కుండి తోటమాలిని చూసి, "నన్ను క్షమించు! నా కారణంగా రోజు నీరు వృధా అవుతున్నాయి. నేను ఇక పనికిరానని అనిపిస్తుంది.", అని దుఃఖంతో చెప్పింది. 

 

ఇది విన్న తోటమాలి,"రా, నీకు ఓ అద్భుతమైన విషయం చూపిస్తాను", అని ఒక చిరునవ్వుతో అన్నాడు. 

 

అతను పగిలిన కుండకు, తను ప్రతి రోజు నడిచే మార్గాన్ని చూపించాడు. మార్గం పొడవునా అందమైన పువ్వులు వికసించడం చూసి, ఆ కుండా ఆశ్చర్యపోయింది. 

 

"ఈ అందమైన పువ్వులను చూస్తున్నావా? నీ నుండి కారిన నీటి కారణంగానే ఈ పువ్వులు వికసించాయి. నీ పగుళ్లు బలహీనతలా అనిపించవచ్చు, కాని ఇది మన మార్గంలో అందాన్ని సృష్టించాయి.", అని తోటమాలి చెప్పాడు.

 

పగిలిన కుండ సంతోషంగా మరియు గర్వంగా భావించింది. లోపాలు కూడా ఊహించని విధంగా మంచిని కలిగిస్తాయని అర్థం చేసుకొనింది. 

 

పగిలిన కుండ - Moral of the story:

 "మన లోపాలు మరియు బలహీనతలు దాగిన ప్రయోజనాలను కలిగి ఉండవచ్చు. కొన్నిసార్లు, సమస్యగా అనిపించేది వాస్తవానికి ఇతరులకు అద్భుతమైన రీతిలో సహాయపడవచ్చు."

 

"Our imperfections and weaknesses may have hidden benefits. Sometimes, what we feel like a problem can actually help others in a wonderful way."

 

పగిలిన కుండ - మనకు ఇచ్చే పాఠం:

ప్రతి వ్యక్తికి లోపాలు ఉంటాయి, కానీ వాటివల్ల కూడా ప్రపంచానికి మేలు జరుగవచ్చు. బాధపడే బదులు మన బలహీనతల వల్ల కలిగే మంచిని గుర్తించాలి. 

__________________________

నాట్యం చేసిన ఒంటె | The Dancing Camel

నాట్యం చేసిన ఒంటె - కథ నేపథ్యం:

ఒక అందమైన అడివిలో, ఇతర జంతువులతో పాటు, బలమైన మరియు పొడవైన కాళ్ళతో ఎటువంటి దారినైనా సులభంగా నడవగలిగే సామర్థ్యంగల ఒక ఒంటె ఉండేది. కానీ అది తన గురించి అసంతృప్తిగా ఉండేది. ఒక రోజు, అతను నదీ తీరంపై ఒక అందమైన నెమలి తన రంగురంగుల రెక్కలను విస్తరించి నాట్యం చేస్తుండగా చూసింది. సూర్యకాంతిలో మెరుస్తున్న నెమలి ఈకలను చూసి ఒంటె ఆశ్చర్యపోయింది. 

 

The camel dancing in the forest.

 

నాట్యం చేసిన ఒంటె - కథ ముఖ్య పాత్రలు:

  • ఒంటె – నెమలి లాగా నాట్యం చేయాలని ఆశపడే ఒక అటవీ జంతువు.
  • నెమలి – సొగసుగా నాట్యం చేసే అందమైన పక్షి.
  • బుద్ధిమంతుడైన నక్క – ఒంటెకు జీవిత పాఠం చెప్పే తెలివైన అటవీ జంతువు. 
 

నాట్యం చేసిన ఒంటె -కథ:

ఒక రోజు ఉదయం, ఒంటె అడివిలో నడుస్తుండగా నది ఒడ్డున ఒక నెమలిని నాట్యం చేయడాన్ని చూసింది. నెమలి తన రంగురంగుల రెక్కలను విస్తరించి, ఆనందంతో తిరుగుతూ నాట్యం చేయడం చూసి ఒంటె ఆశ్చర్యపోయింది. 

 

“నాకూడా ఇలా నాట్యం చేయడం వచ్చి ఉంటే ఎంత బావుండేది! నేను నాట్యం నేర్చుకుంటే, అందరూ నన్ను మెచ్చుకుంటారు.” అని ఒంటె అనుకొంది. 

 

Also Read: కుందేలు యొక్క క్షమాపణ | The Rabbit's Apology

 

దృఢసంకల్పంతో ఒంటె నాట్య సాధన ప్రారంభించింది. తన పొడవాటి కాళ్లు ఎత్తి నెమలిలా తిప్పడానికి ప్రయత్నించింది. కానీ ఒంటెలకు నాట్యం చేయడం సాధ్యం కాదు కాబట్టి, దాన్ని భారీ శరీరం అదుపుతప్పి తన పొడవాటి కాళ్ళు చిక్కుకున్నాయి. అకస్మాత్తుగా అది నేలమీద పడిపోయింది! 

 

ఇది చూసిన ఇతర అడివి జంతువులు నవ్వాయి. ఒంటె చాలా సిగ్గుగా భావించింది. కానీ మళ్లీ ప్రయత్నించింది. తను ఎంత ప్రయత్నించిందో, అంత ఎక్కువగా కింద పడింది. 

 

ఆ సమయంలో అక్కడే ఉన్న తెలివైన నక్క ఒంటెను చూసి, “నువ్వు నెమలి లాగా నాట్యం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు?” అని ప్రశ్నించింది. 

 

“నన్ను కూడా నెమలి లాగా అందరూ మెచ్చుకోవాలని ఉంది,” అని ఒంటె బాధగా చెప్పింది. 

 

నక్క నవ్వి, “ప్రతి జంతువుకు తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. నెమలి నాట్యం చేయడానికి పుట్టింది. కానీ నువ్వు పొడవైన దూరాలు అలసట లేకుండా ప్రయాణించగలవు. అదే నీ బలం!” అని చెప్పింది. 

 

ఒంటె కొద్దిసేపు ఆలోచించి, నక్క చెప్పింది నిజమేనని గ్రహించింది. తాను నెమలి లాగా ఉండాల్సిన అవసరం లేదు. తాను ఎలా ఉందో, అదే తన ప్రత్యేకత. అప్పటి నుంచి ఒంటె నాట్యం చేయడానికి ప్రయత్నించడం మానేసి, తనకు ఉన్న ప్రత్యేకతను గౌరవించింది. 

 

నాట్యం చేసిన ఒంటె - Moral of the story:

"ప్రతి ఒక్కరికీ తమదైన రీతిలో ప్రత్యేకత ఉంటుంది. గొప్పవారిగా మారడానికి ఇతరులను అనుసరించాల్సిన అవసరం లేదు. మనకు ఉన్న ప్రతిభను గౌరవించి, మన బలాలను మెరుగుపరుచుకోవాలి."

 

"Everyone is special in their own way. We don’t have to be like others to be great. Instead of trying to copy others, we should be proud of our own talents and strengths."

 

నాట్యం చేసిన ఒంటె - మనకు ఇచ్చే పాఠం:

మనమందరం ఇతరులను అనుసరించాల్సిన అవసరం లేదు, మన ప్రత్యేకతను అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. మన బలాలను గుర్తించి మనం గర్వించాలి.

_________________________________

Conclusion: 

The above 2 Moral Stories in Telugu remind us that everyone is special in their own way. Instead of feeling sad about our flaws, we should focus on our strengths. Just like the cracked pot helped flowers grow and the camel realized its own abilities, we should also embrace what makes us unique. Always remember—your true strength lies in being yourself!



Previous Post Next Post