Telugu Moral Stories on 'తొందరపడిన నత్త' & 'పిరికి ఆక్టోపస్'

Moral Stories in Telugu | Friendship Moral Stories in Telugu for Kids


Welcome to our collection of best Moral Stories in Telugu for children !


Everyone has fears, doubts, and challenges, but true courage is shown in how we face them. In the following two Moral Stories in Telugu, story 'తొందరపడిన నత్త కథ', Slinky learns the value of patience by accepting his natural pace. In the story 'భయాన్ని మించిన స్నేహం', Olive overcomes her fears and discovers the true meaning of friendship.

_____________________________

తొందరపడిన నత్త కథ | The Snail Who Hurried Too Much

కథ నేపథ్యం (Story Context):   

 హరితంగా విరాజిల్లే అటవిలో స్లింకీ అనే చిన్న నత్త ఉండేది. నెమ్మదిగా ఉండటం వల్ల అందరూ అతడిని వెక్కిరించేవారు. అందరికీ తనను వేగంగా కదలగలవాడిగా చూపించాలనే తపనతో తొందరపడటం ప్రారంభించాడు. కానీ అది అతన్ని సమస్యల్లోకి నెట్టేసింది. చివరికి, తెలివైన తాబేలుతో మాట్లాడిన తర్వాత, సహనంతో ఉండటం, తన సహజమైన నెమ్మదితనాన్ని అంగీకరించడం విజయానికి దారి తీస్తుందని గ్రహించాడు. 

 

The Monkey and Spider laughing at Snail.
 

కథ ముఖ్య పాత్రలు (Key Characters) :   

  • స్లింకీ – తనను వేగంగా మారాలని కోరుకునే చిన్న నత్త.
  • తాబేలు – సహనంతో ముందుకు వెళ్లాలని నేర్పించే తెలివైన తాబేలు.
  • కోతులు & ఇతర జంతువులు – స్లింకీని నెమ్మదిగా ఉందని వెక్కిరించే అటవీ జంతువులు. 

 కథ (Story): 

అటవిలో స్లింకీ అనే చిన్న నత్త జీవించింది. స్లింకీ స్నేహపూర్వకమైనది మరియు చాలా మందికి ప్రియమైననది, కానీ అతనికి ఒక సమస్య ఉండేది. అతను నెమ్మదిగా ఉన్నందుకు ప్రతి ఒక్కరూ అతన్ని ఎప్పుడూ ఆటపట్టించేవారు. 

 

"త్వరగా రా, స్లింకీ! నువ్వు చేరుకునేలోపు పండ్లు కుళ్లిపోతాయి!" అని కోతులు నవ్వేవారు. 

 

"నువ్వు చెట్టు ఎక్కే సమయానికి, నేను సరికొత్త వెబ్‌ను నిర్మించగలను!" అని సాలీడు (spider) ముసిముసిగా నవ్వింది. 

 

స్లింకీ కూడా వారితో నవ్వేది, కానీ తన మనసులో బాధ ఉండేది. తను కూడా కోతుల్లా, జింకల్లా మరియు హమ్మింగ్ బర్డ్స్ లాగా వేగంగా ఉండాలని అనుకునేది. 

 

ఒక ఉదయం తను నిర్ణయించుకుంది, "ఇంక నేను వేగంగా కదలాలి! ఎవరూ ఇకపై నన్ను నెమ్మదిగా ఉంటానని అనకూడదు!" 

 

కాబట్టి, నత్త లాగా జాగ్రత్తగా మరియు స్థిరంగా కదలడానికి బదులుగా, స్లింకీ పరుగెత్తడం పప్రారంభించింది. తను వేగంగా చెట్లు ఎక్కే ప్రయత్నంలో పొదల్లో పడిపోయింది. ఆహారం తొందరగా పట్టుకునే ప్రయత్నంలో ఆహారాన్ని నేల మీద పడేసుకుంది. నెమ్మదిగా నడిచే బదులుగా పరుగెత్తే ప్రయత్నంలో తను పడిపోయింది! 

 

ఆకులు మరియు దుమ్ముతో కప్పబడిన నత్తను చూసి,"అయ్యో, స్లింకీ! ఏమైంది?" అని ఒక తెలివైన ముసలి తాబేలు నత్తను అడిగింది. 

 

"నేను నెమ్మదిగా ఉన్నానని అందరూ వెక్కిరించటం నాకిష్టం లేదు. కాబట్టి నేను వేగంగా కదిలితే, అందరూ నన్ను ఆటపట్టించడం మానేస్తారని అనుకున్నాను, కానీ ఇప్పుడు అన్నీ గందరగోళంగా మారిపోయాయి!" అని స్లింకీ బాధతో నిట్టూర్చింది. 

 

ముసలి తాబేలు చిరునవ్వుతో, "స్లింకీ, నత్తలు ఎందుకు నెమ్మదిగా కదులుతాయో తెలుసా?" అని అడిగింది. 

 

స్లింకీ తనకు తెలియదు అన్నట్టు తల ఊపింది. 

 

"ఓపిక మరియు సహనం మనకు పనులు సరిగ్గా చేయడం లో తోడ్పడుతాయి. అదే తొందరపడటం మనకు వేగంగా అనిపించవ్వొచ్చు, కానీ అది తప్పులకు దారి తీస్తుంది. 

 

నీ చుట్టూ పక్కల చూడు, చెట్లు వేగంగా పెరుగుతాయా? లేదు! అవి తమ సమయాన్ని తీసుకుంటాయి, కానీ ఎత్తుగా మరియు బలంగా పెరుగుతాయి. 

 

నది తొందరగా పారదు; అది క్రమంగా ప్రవహింస్తుంది మరియు సముద్రానికి చేరుకుంటుంది. 

 

ప్రకృతిలో ప్రతిదీ తనదైన పద్ధతిలో కదులుతాయి, నీవు కూడా ప్రత్యేకమైనదానివి." అని ముసలి తాబేలు నత్తకు అర్థం అయ్యేలా చెప్పింది. 

 

స్లింకీ శ్రద్ధగా వినింది. బహుశా నెమ్మదిగా ఉండటం అంత చెడ్డ విషయం కాదు అని గ్రహించింది. 

 

ఆ రోజు నుంచి, తను తొందరపడడం మానేసి, తన సహజమైన వేగాన్ని అంగీకరించి ప్రతి క్షణాన్ని ఆనందించింది. 

 

ఇతరుల కోసం తాను మారటంకంటే, తన సహజమైన తత్వాన్ని అంగీకరించడం చాలా మంచిదని తను నేర్చుకుంది. అలా, తనను తాను ప్రేమిస్తూ, అటవిలో సంతోషంగా జీవించింది. 

 

Moral of the Story:

 

తొందరపడటం తప్పులకు దారి తీస్తుంది, కానీ సహనం విజయాన్ని అందిస్తుంది. ఇతరుల కోసం మార్వడానికి ప్రయత్నించే బదులు , స్వతహాగా మనల్ని మనం అంగీకరించాలి. 

 

" If you hurry, you may make mistakes. But if you are patient, you will do well. Be yourself instead of changing for others." 

 

ప్రాథమిక పాఠం (Basic Lesson Learnt):

 

నెమ్మదిగా ఉండటం నష్టం కాదు; అది మనం సరైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతుంది.

______________________________________________

భయాన్ని మించిన స్నేహం | Friendship Beyond Fear 

కథ నేపథ్యం (Story Context):   

ఒక మహాసముద్రపు లోతులో, ఆలివ్ (Olive) అనే ఒక పిరికి ఆక్టోపస్ (Octopus) నివసించేది. దానికి మృదువైన, నీలి రంగు చర్మం మరియు పొడవైన చేతులు ఉండేవి. ఇతర సముద్ర జీవులు తన పగడపు గుహను (Coral Cave) దాటి ఈదుతూ వెళ్లడాన్ని చూడడం ఇష్టపడేది, కానీ తను ఎప్పుడూ వారితో చేరలేదు. ఆమె చాలా పిరికి మరియు పెద్ద మహాసముద్రం అంటే భయం, అందుకే ఆమె ఎప్పుడూ తన గుహలోనే ఉండేది. "నేను బయటకు వెళితే ఏదైనా అనుకోకుండా జరుగుతుందా? ఎవ్వరైనా నన్ను చూసి నవ్వుతారా?" అనే భయంతో ఉండేది. కానీ ఒక రోజు, ఒక చిన్న చేపకు, ఆమె సహాయం అవసరమైనప్పుడు, ఆలివ్ తన భయాలను ఎదుర్కోవలసి వచ్చింది. 

 

The proud Octopus handing over the pearl to the Fish.

 

కథ ముఖ్య పాత్రలు (Key Characters) :  

  • ఆలివ్ - శాంతి ప్రియమైన, బహుశా తక్కువ మాట్లాడే ఆక్టోపస్.
  • మల్లీ - తన విలువైన ముత్యాన్ని పోగొట్టుకున్న ఉల్లాసభరితమైన ఒక చిన్న చేప..
  • ఇతర సముద్ర ప్రాణులు - ఆలివ్ను ప్రోత్సహించిన మిత్రులు. 

కథ (Story):

ఒక రోజు ఉదయం, ఆలివ్ తన గుహలో విశ్రాంతి తీసుకొంటూ సముద్రపు జీవులను గమనిస్తూ ఉండగా, అకస్మాత్తు ఒకరి ఏడుపు వినిపించింది. ఆమె తన గుహ నుండి బయట చూడగా, మల్లీ అనే ఒక చిన్న చేప చాలా బాధలో ఏడుస్తున్నట్టు కనిపించింది.

 

"ఏం అయ్యింది, మల్లీ?" అని ఆలివ్ మృదువుగా అడిగింది. 

 

"నేను నా ముత్యం పోగొట్టుకొన్నాను! అది ఒక చీకటి లోయలో పడిపోయింది," అని మల్లీ దిగులుగా చెప్పింది. "అది నా అమ్మమ్మ ఇచ్చిన కానుక, నేను దాన్ని ఒంటరిగా ఎప్పటికీ వ్యతకలేను!" 

 

ఆలివ్ భయంతో చేతులను ముడిచుకుంది. ఆమె ఇంతకు ముందు చీకటి లోయ లోపల ఎప్పుడు పోలేదు. "అది చాలా లోతుగా మరియు భయంకరంగా ఉంటుంది," అని ఆమె అనుకుంది. కానీ ఆమె మల్లీని బాధలో ఉండడం చూసిప్పుడు, తన హృదయంలో ఒక కొత్త ధైర్యం వచ్చింది. 

 

"నేను ప్రయత్నిస్తాను," అని ఆలివ్ చెప్పింది. 

 

ఆలివ్ తన చేతులను ముందుకు చాపుతూ, నెమ్మదిగా లోయ వైపుకు వెళ్ళింది. లోతుగా వెళ్తున్నకొద్దీ చీకటి పెరిగింది. నీటిలో నీలి నీడలు కదులుతూ ఉన్నాయి మరియు చిన్న బుడగలు ఆమె చర్మాన్ని చక్కిలిగింత చేశాయి. ఆమె గుండె గట్టిగా కొట్టుకుంది, కానీ ఆలివ్ గట్టిగా శ్వాస తీసుకొని ముందుకు కొనసాగింది. తన మెరిసే కాంతిని ఉపయోగించి, రాళ్ళ మధ్య వెతికింది. 

 

అక్కడ! ఓ చిన్న కాంతి మెరుస్తోంది. 

 

"ముత్యం!" అని ఆమె ఆనందంగా అనుకుంది. 

 

ఆత్మవిశ్వాసంతో ముత్యాన్ని తన చేతులతో పట్టుకొని, వీలైనంత త్వరగా ఈదుతూ పైకి వచ్చింది. 

 

"ఇదిగో, నీ ముత్యం!", అని మల్లీకి ముత్యాన్ని అందించింది. 

 

"ఆలివ్, నువ్వు నిజంగా ధైర్యవంతురాలివి!" అని మల్లీ ఆనందంతో అరిచింది. 

 

"అవును! నువ్వు చాలా సాహసం చేసావు!" అని, అక్కడ గుమిగూడిన సముద్ర జీవులు అన్నాయి. 

 

ఆలివ్ సిగ్గుపడుతూ నవ్వింది. తాను మనసులో చాలా సంతోషించింది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. భయం ఉన్నప్పటికీ ముందుకు వెళ్లి సాహసం చేయడమే! 

 

Moral of the Story:


ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. మన భయాలను అధిగమించి, ఇతరులను సహాయం చేయడంలో అసలైన ధైర్యం ఉంటుంది. మనం చిన్న చిన్న సమస్యలను ధైర్యంగా ఎదురుకొంటే, మనకు తెలియకుండా మనం బలమైనవారమవుతాము.


Bravery doesn’t mean having no fear; it means taking action even when you feel afraid. When we step out of our comfort zones to help others, we often discover courage within ourselves that we never knew existed.

 

 ప్రాథమిక పాఠం (Basic Lesson Learnt):

 

ప్రతి ఒక్కరికి భయాలు ఉంటాయి, కాని వాటిని ఎదుర్కోవడం మమ్మల్ని బలోపేతం చేస్తుంది. ఆలివ్ లాగా, మనలోను భయముంటుంది, కాని ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు, మనలోని ధైర్యం బయటపడుతుంది. 

________________________________

Conclusion:



These two Moral Stories in Telugu teach us the importance of patience, courage, and embracing our true selves. Loving who we are, overcoming our fears, and practicing patience lead to success. We should only change if it benefits us, not just to please others.

 

  Looking for more inspiring tales? Check out our collection of Kindness Moral Stories in Telugu and Animal Stories in Telugu to continue the journey of learning through storytelling!

 

 



Previous Post Next Post