Podupu Kathalu in Telugu 1 | Riddles in Telugu

పొడుపు కథలు 

Podupu Kathala in Telugu



1. ఆకు చిటికెడు, కాయ మూరెడు. ఏంటో తెలుసా?

జ. మునగ

2. సన్నని స్తంభం. ఎవరు ఎక్కలేరు. దిగలేరు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?

జ. సూది.

3. చూస్తే చూసింది కానీ కళ్లు లేవు. నావితే నవ్వింది కానీ నోరు లేదు. తంతే తన్నింది కానీ కాళ్లు లేవు. ఇంతకీ ఏమిటది?

జ. అద్దం.

4. గాల్లో ఎగురుతాను, కానీ రెక్కలు లేవు. తోక ఉంటుంది కానీ, పక్షిని కాదు. నేనెవరో చెప్పగలరా?

జ. గాలిపటం.


5. నాకు ఒళ్ళంతా రంధ్రాలే. అయినా చక్కగా నీటిని ఒడిసి పట్టుకుంటాను. నేనెవరో చెప్పగలరా?

జ. స్పాంజ్.

6. చెట్టు మీద పచ్చని కుండలా ఉంటాను. పొట్టనిండా నీరు ఉంటుంది. నా పేరు చెప్పండి చూద్దాం?

జ. కొబ్బరిబోండం.

7. ఎంత ప్రయత్నించినా చేతికి చిక్కదు. ముక్కుకు మాత్రం దొరుకుతుంది. ఏంటది?

జ. వాసన.

8. పచ్చటి దుప్పటి కప్పుకుంటుంది, కమ్మని పండ్లు తింటుంది. ఏమిటో చెప్పండి?

జ. రామచిలుక.

9. ఎంత దూరం నెడితే అంత దగ్గరవుతుంది. చెప్పుకోండి చూద్దాం?

జ. ఊయల.

10. నాలో అన్ని ముక్కలే..! కానీ నన్ను కాయ అంటారు. నేనెవరో తెలుసా?

జ. ఆవకాయ.


11. కాళ్ల కింద నలిగింది. చక్రం పైన తిరిగింది. నిప్పులో నిలిచింది. నీళ్లలో మునిగింది. మూలకొచ్చి కూర్చుంది. ఏంటది?

జ. కుండ.

12. తలుపు తీయగానే, పిలవకపోయినా ఉదయాన్నే ఇంట్లోకొచ్చేదేంటి?

జ. వెలుగు.

13. తనను తానే మింగుతుంది. ఆఖిరికి మాయమవుతుంది. అదేంటి?

జ. కొవ్వొత్తి.

14. గాలితో పుడుతుంది. గాలిలోనే పెరుగుతుంది. గాలి ఎక్కువైతే చచ్చిపోతుంది. ఏంటో తెలిసిందా?

జ. నీటి బుడుగు.

15. ఆకు వేసి అన్నం పెడితే, ఆకు తీసేసి అన్నం తింటాం. చెప్పండి చూద్దాం?

జ. కరివేపాకు.

16. ఇల్లంతా నాకి మూలకు కూర్చుంటుంది. అదేంటి?

జ. చీపురు.

17. ఊరందరికీ ఒకే దీపం. అదేంటో చెప్పండి?

జ. చంద్రుడు.

18. డబ్బిచ్చి కొంటారు, ముందర పెట్టుకొని ఏడుస్తారు. అదేంటి?

జ. ఉల్లిపాయ.

19. ఎంత దానం చేసిన తరగనిది, అంతకు పెరిగేది. అదేంటి?

జ. విద్య.

20. ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన ఒకటే దూరం. అదేంటో చెప్పండి?

జ. ముక్కు.

21. కోట లేని రాజుకు కిరీటం ఉంది. అదేంటి?


జ. కోడిపుంజు.


22. చిటపట చినుకులు చిటారు చినుకులు. ఎంత కురిసిన వరదలు రావు. అదేంటో చెప్పండి?

జ. కన్నీళ్లు.


23. కిటకిట బండి, కిటారి బండి. ఎందరు కూర్చొన్న విరగని బండి. అదేంటి?

జ. రైలు బండి.


24. రాజుగారి తోటలో రోజాపూలు, చూసేవారేగాని లెక్కేసేవారు లేరు.

జ. నక్షత్రాలు.


25. పువ్వుల్లో పుడుతుంది, వెయ్యిమంది కాపలాలో వారాల్లో దాగి వేలాడుతుంది. ఏమిటది?

జ. తేనె.


26. కాళ్ళు లేవు గాని, నడుస్తుంది. కళ్లు లేవు గాని ఏడుస్తుంది. ఏంటది?

జ. మేఘం.


27. అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి. అదేంటో చెప్పండి?

జ. పెదవులు.


28. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. ఏంటది?

జ. తేనెగూడు.


29. ఒక తోక లేని పిట్టా తొంభై మైళ్లు ప్రయాణిస్తుంది. అదేంటో చెప్పండి?

జ. ఉత్తరం.


30. గణగణమంటూ దూసుకు వస్తుంది, మేఘం లేకున్నా వర్షం కురుస్తుంది. అది ఏంటి?

జ. ఫైర్ ఇంజిన్.
Previous Post Next Post